Ap News: మద్యంపై పన్ను రేట్ల సవరణ.. ఏపీ సర్కార్‌ ఉత్తర్వులు

మద్యంపై పన్ను రేట్లను సవరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యాట్‌లో మార్పులు చేస్తూ రాష్ట్ర అబ్కారీ శాఖ జీవో జారీ చేసింది. మద్యం మూల ధరపై తొలి

Updated : 10 Nov 2021 15:47 IST

అమరావతి: మద్యంపై పన్ను రేట్లను సవరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యాట్‌లో మార్పులు చేస్తూ రాష్ట్ర అబ్కారీ శాఖ జీవో జారీ చేసింది. మద్యం మూల ధరపై తొలి విక్రయం జరిగేచోట పన్నును సవరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దేశంలో తయారైన విదేశీ బ్రాండ్లపై ఉన్న ధర ఆధారంగా పన్నులో మార్పులు చేశారు.

బ్రాండ్‌ల వారీగా పన్నులో చేసిన మార్పులు ఇలా..

* రూ.400లోపు ఉన్న మద్యం బ్రాండ్లపై 50 శాతం వ్యాట్‌

* రూ.400 నుంచి రూ.2,500 వరకు ఉన్న మద్యం కేసుపై 60 శాతం వ్యాట్‌ 

* రూ.2,500 నుంచి రూ.3,500 వరకు ఉన్న మద్యం కేసుపై 55 శాతం వ్యాట్‌

* రూ.5,000, ఆపై ఉన్న మద్యం కేసుపై 45 శాతం వ్యాట్‌

దేశీయ తయారీ బీర్ కేసుపై..

* రూ.200 కంటే తక్కువున్న ధర ఉన్న బ్రాండ్లపై 50 శాతం వ్యాట్‌

* రూ.200 కంటే ఎక్కువ ధర ఉన్న బీర్ కేసుపై 60 శాతం వ్యాట్‌ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని