Updated : 22/11/2021 11:27 IST

AP News: కాసేపట్లో ఏపీ కేబినెట్‌ అత్యవసర భేటీ

అమరావతి: ఏపీ కేబినెట్‌ కాసేపట్లో అత్యవసరంగా భేటీ కానుంది. వరదల కారణంగా ఇవాళ్టితోనే శాసన సభ సమావేశాలను ముగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కేబినెట్లో నిర్ణయం అనంతరం సమావేశాలను వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మూడు రాజధానుల చట్టం విషయంలోనూ కేబినెట్లో ఒక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. వరద బాధితులకు రూ.2వేలు చొప్పున సాయం అందించే అంశం.. సౌర విద్యుత్‌ కొనుగోలు అంశాలపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది. 

మరోవైపు ఇవాళ అసెంబ్లీ సమావేశాలు(మూడో రోజు) 10 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లిన కారణంగా పలు ప్రశ్నలు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. 

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని