AP Cabinet: ఏపీ కేబినెట్‌ భేటీ ప్రారంభం

ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్ర సచివాలయంలో సీఎం జగన్‌ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో

Updated : 28 Oct 2021 22:23 IST

అమరావతి: ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్ర సచివాలయంలో సీఎం జగన్‌ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదముద్ర వేయనున్నారు. ముఖ్యంగా సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో ప్రభుత్వం విక్రయించడంపై సినిమాటోగ్రఫీ, చట్టసవరణపై చర్చించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడంపై హైకోర్టు స్టే ఇవ్వడంతో చట్ట సవరణకు సిద్ధం చేసిన ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేయనున్నారు.

ఆలయాల్లో భద్రతకు సీసీ కెమెరాలు, ఇతర చర్యలకు ప్రత్యేకంగా విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ విభాగం, ‘ఈడబ్ల్యూఎస్‌’ కేటగిరిలోని వారి సంక్షేమ కార్యకలాపాలకు ప్రత్యేకంగా ఓ శాఖ ఏర్పాటుపై కేబినెట్‌లో చర్చించనున్నారు. ఇలా దాదాపు 20 నుంచి 25 అంశాలపై మంత్రివర్గం చర్చించి ఆమోదముద్ర వేయనుంది. కేబినెట్‌ భేటీ ముగిసిన అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించే అవకాశముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని