
Updated : 28 Oct 2021 22:09 IST
Ap News: తాజా రాజకీయ పరిణామాలపై గవర్నర్‌తో చర్చించిన జగన్
విజయవాడ: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను ఏపీ ముఖ్యమంత్రి జగన్ కలిశారు. గురువారం సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లిన జగన్.. నవంబరు ఒకటో తేదీన జరిగే వైఎస్సార్ జీవిత సాఫల్య అవార్డుల ప్రదానోత్సవానికి ముఖ్యఅతిథిగా రావాలని ఆహ్వానించారు. దాదాపు 40 నిమిషాల పాటు గవర్నర్‌తో సమావేశమైన సీఎం రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్టు సమాచారం. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులకు దారితీసిన అంశాలను గవర్నర్‌కు వివరించినట్టు తెలిసింది. తెదేపా నేతలు చేసిన వ్యాఖ్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. శాసనసభ సమావేశాల నిర్వహణపై గవర్నర్‌తో సీఎం చర్చించారు.
ఇవీ చదవండి
Tags :