AP CM Jagan : 3 పారిశ్రామిక కారిడార్లను అమలు చేస్తోన్న ఏకైక రాష్ట్రం ఏపీ

ఎగుమతుల విషయంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న వాణిజ్య

Published : 21 Sep 2021 13:19 IST

విజయవాడలో వాణిజ్య ఉత్సవ్‌ను ప్రారంభించిన సీఎం

విజయవాడ : ఎగుమతుల విషయంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న వాణిజ్య ఉత్సవ్‌-2021ని ముఖ్యమంత్రి జగన్‌ విజయవాడలో ప్రారంభించారు. అనంతరం పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన కేంద్రాన్ని సీఎం తిలకించి ప్రసంగించారు.

‘గత రెండేళ్లలో అనేక సవాళ్లు ఎదురైనా పారిశ్రామికంగా రాష్ట్రం గణనీయ వృద్ధి సాధించింది. 2021లో ఎగుమతుల్లో 19.4 శాతం మేర వృద్ధి నమోదైంది. 68 మెగా పరిశ్రమలతో రూ.30,175 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 62 మెగా ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. 3 పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే. రాష్ట్రానికి సహకరించాలని పరిశ్రమ వర్గాలను కోరుతున్నాను’ అని జగన్‌ పేర్కొన్నారు.

రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి దేశ, విదేశాలకు చెందిన రాయబారులు, పారిశ్రామికవేత్తలు, ఎగుమతిదారులు, విధాన రూపకర్తలు హాజరుకానున్నారు. చౌకగా ఎగుమతుల నిర్వహణకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను అంతర్జాతీయ ఎగుమతిదారులకు వివరించడమే వాణిజ్య ఉత్సవ్‌ లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు