
Published : 19 Nov 2021 12:29 IST
AP Floods: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం: జగన్
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలపై సీఎం జగన్ అధికారులతో సమీక్షించారు. ప్రభావం అధికంగా ఉన్న చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. చెరువులకు గండ్లు పడిన చోట తక్షణమే చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. తిరుపతిలో వరదనీటి నిల్వకు కారణాలపై అధ్యయనం చేయాలన్నారు. బాధితులను ఆదుకోవడంలో ఉదారంగా ఉండాలని సూచించారు.
వరదల్లో మృతి చెందిన బాధితుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ.2వేల తక్షణ సాయం అందించాలని సీఎం పేర్కొన్నారు. వర్షాల తర్వాత వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు జగన్ సూచించారు.
Tags :