Updated : 14/11/2021 00:39 IST

AP News: శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఏపీ సీఎం జగన్‌

తిరుమల: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం అమిత్ షా తిరుమల పద్మావతి అతిథిగృహానికి చేరుకున్నారు. అక్కడే అమిత్‌ షా భోజనం చేసి తిరుపతి వెళ్లనున్నారు. ఈ రాత్రికి తిరుపతి తాజ్‌ హోటల్‌లో అమిత్‌ షా బస చేయనున్నారు. శ్రీవారిని దర్శించడానికి ముందు కేంద్ర మంత్రి అమిత్‌ షా ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకున్నారు. 3 రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన అమిత్‌ షాకు రేణిగుంట విమానాశ్రయంలో ఏపీ సీఎం జగన్‌ శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఆదివారం ఉదయం భారత వైమానిక దళ హెలికాప్టర్‌లో అమిత్‌ షా బయల్దేరి నెల్లూరు జిల్లా వెంకటాచలానికి చేరుకుంటారు. అక్షర విద్యాలయ, స్వర్ణ భారతి ట్రస్టు, ముప్పవరపు ఫౌండేషన్‌లకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోమ నైపుణ్యాభివృద్ధి కేంద్రం, గ్రామీణ స్వయం సాధికార శిక్షణ సంస్థను సందర్శిస్తారు. మధ్యాహ్నం స్వర్ణ భారతి ట్రస్టు 20వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటారు.

తిరిగి మధ్యాహ్నం 2.40 గంటలకు తిరుపతిలోని తాజ్‌ హోటల్‌కు చేరుకుంటారు. అదే హోటల్‌లో మధ్యాహ్నం 3 గంటల నుంచి జరిగే సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొంటారు. ఆ భేటీ ముగిశాక ఆదివారం రాత్రి తాజ్‌ హోటల్‌లోనే బస చేస్తారు. సోమవారం ఉదయం వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి బయల్దేరి సాయంత్రం 5.40కు దిల్లీ చేరుకుంటారు.


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని