
Published : 28 Nov 2021 18:29 IST
AP News: ఏపీ సీఎస్ సమీర్‌శర్మ సర్వీసును పొడిగించిన కేంద్రం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ సర్వీసును కేంద్రం మరో ఆరు నెలల పాటు పొడిగించింది. 2022 మే 31వ తేదీ వరకు సీఎస్ సర్వీసును పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 1న సమీర్‌శర్మ ఏపీ సీఎస్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో ఆయన వచ్చే ఏడాది మే 31 వరకు సీఎస్‌గా కొనసాగనున్నారు.
Tags :