AP News: రెండున్నరేళ్లు అయినా సీపీఎస్‌ ఎందుకు రద్దు చేయరు?

అధికారంలోకి వచ్చిన వారంలోపు సీపీఎస్‌ రద్దు చేస్తామని పాదయాత్ర సమయంలో సీఎం జగన్‌ హామీ ఇచ్చారని..

Published : 10 Dec 2021 12:45 IST

విజయవాడలో ఉద్యోగుల ‘సింహగర్జన’ సభ

అమరావతి: అధికారంలోకి వచ్చిన వారంలోపు సీపీఎస్‌ రద్దు చేస్తామని పాదయాత్ర సమయంలో సీఎం జగన్‌ హామీ ఇచ్చారని.. రెండున్నరేళ్లు పూర్తయినా ఎందుకు దాన్ని అమలు చేయడం లేదని సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అప్పలరాజు ప్రశ్నించారు. సీపీఎస్‌పై మూడు కమిటీలు ఎందుకు వేశారని నిలదీశారు.

‘సింహగర్జన’ పేరిట విజయవాడ శాతవాహన కళాశాలలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు సభ నిర్వహించారు. ఈ సభలో అప్పలరాజు మాట్లాడుతూ సీపీఎస్‌ రద్దు తమ హక్కు అన్నారు. దాన్ని రద్దు చేసే వరకు తమ ఉద్యమం ఆగదని చెప్పారు. వెంటనే సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఈ సభకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఉద్యోగులు హాజరయ్యారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని