
Updated : 01 Nov 2021 13:05 IST
AP Formation Day: తాడేపల్లిలో ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సీఎం జగన్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత తెలుగు తల్లి, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాల వద్ద సీఎం నివాళులర్పించారు.
ప్రధాని శుభాకాంక్షలు.. తెలుగులో ట్వీట్
ఏపీ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన తెలుగులో ట్వీట్ చేశారు. ‘‘ఏపీ ప్రజలు తమ నైపుణ్యం, దృఢ సంకల్పం, పట్టుదలకు మారు పేరు. అందువల్ల వారు అనేక రంగాల్లో రాణిస్తున్నారు. ఏపీ ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా, విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని మోదీ పేర్కొన్నారు.
Tags :