Ap News: ఎయిడెడ్‌ సంస్థల విలీనం.. నాలుగు ఆప్షన్లతో అంతర్గత మెమో జారీ

ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడెడ్‌ సంస్థల విలీన మార్గదర్శకాలతో రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ అంతర్గత మెమో జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,249 ఎయిడెడ్‌ సంస్థల్లో 68.78 శాతం సంస్థలు

Published : 13 Nov 2021 01:07 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడెడ్‌ విద్యా సంస్థల విలీనం విషయంలో తీసుకోవాల్సిన అంశాలు, మార్గదర్శకాలతో రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ అంతర్గత మెమో జారీ చేసింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఎయిడెడ్‌ సంస్థల విలీనం విషయంలో జరుగుతోన్న ఆందోళనలతో ఈ మెమో జారీ చేసింది. 2,249 ఎయిడెడ్‌ విద్యా సంస్థల్లో 68.78 శాతం విద్యా సంస్థలు విలీనానికి అంగీకరించగా.. 702 ఎయిడెడ్‌ విద్యా సంస్థలు విలీనానికి అంగీకరించలేదని ప్రభుత్వం తెలిపింది. విలీనానికి అంగీకరించని ఎయిడెడ్‌ సంస్థలపై ఎలాంటి ఒత్తిడి ఉండబోదని ఉన్నత విద్యా శాఖ వెల్లడించింది. విలీనానికి నాలుగు ఆప్షన్లను ఆయా సంస్థలు ఎంచుకునే అవకాశం ఉందని మెమోలో పేర్కొంది.

ప్రభుత్వం ఇచ్చిన ఆప్షన్లు ఇవే..

ఆప్షన్‌-1: ఆస్తులు, ప్రస్తుతం పని చేస్తున్న సిబ్బందితో సహా ప్రభుత్వంలో విలీనానికి సుముఖత.

ఆప్షన్‌-2: ఆస్తులు మినహా ఎయిడెడ్‌ సిబ్బందిని ప్రభుత్వానికి సరెండర్‌ చేయడానికి అంగీకరించి ప్రైవేట్ అన్ ఎయిడెడ్‌ విద్యా సంస్థలుగా కొనసాగే అవకాశం.

ఆప్షన్‌-3: ఏ రకమైన విలీనానికి సుముఖత కనబర్చకుండా ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ విద్యా సంస్థలుగా కొనసాగడం.

ఆప్షన్-4: గతంలో విలీనానికి తెలిపిన అంగీకారాన్ని వెనక్కు తీసుకునే అవకాశం.

ఈ ఆప్షన్‌లను కచ్చితంగా పాటించాలని అధికారులకు సూచిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని