AP News: సినిమా టికెట్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీలో సినిమా టికెట్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

Updated : 28 Dec 2021 13:49 IST

అమరావతి: ఏపీలో సినిమా టికెట్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ల ధరల పరిశీలనకు కొత్త కమిటీని నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ కమిటీకి హోంశాఖ ముఖ్యకార్యదర్శి విశ్వజిత్‌ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు.

దీనిలో సభ్యులుగా రెవెన్యూ, ఆర్థిక, పురపాలక ముఖ్యకార్యదర్శులు, సమాచార శాఖ కమిషనర్‌, న్యాయశాఖ కార్యదర్శి, కృష్ణా జిల్లా జేసీతో పాటు థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు, సినీ గోయర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు ఉంటారు.  థియేటర్ల వర్గీకరణతో పాటు టికెట్ల ధరలను ఈ కమిటీ నిర్ధారించనుంది. అనంతరం ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని