Covid: కరోనాతో ఏపీలో ఎంత మంది చిన్నారులు అనాథలయ్యారో తెలుసా?

కరోనా మహమ్మారి కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో 6,800 మంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయారని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అనాథలైన 4,033 మంది..

Updated : 19 Aug 2021 18:57 IST

అమరావతి: కరోనా మహమ్మారి కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో 6,800 మంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయారని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అనాథలైన 4,033 మంది పిల్లల వివరాలు సేకరించినట్లు విద్యాశాఖ తెలిపింది. వారిలో 1,659 మంది ప్రభుత్వ బడులు, కళాశాలల్లో; 2,150 మంది ప్రైవేట్‌ బడులు, కళాశాలల్లో చదువుతున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. మిగతా 524 మందిని శిశువులుగా గుర్తించినట్లు పేర్కొంది. కరోనా బాధిత పిల్లలకు ఉచిత విద్య అందించాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో అనాథలైన పిల్లల వివరాలు సేకరించాలని విద్యాశాఖను ఏపీ సర్కార్‌ ఆదేశించింది. వెంటనే పాఠశాలల్లో నమోదు ప్రక్రియను కొనసాగించాలని విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేట్‌ పాఠశాలల్లో చదివే అనాథ పిల్లలకూ విద్యాకానుక కిట్‌ అందించాలని తెలిపింది. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలపై నెలవారీ నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని