AP News: విజయవాడ నుంచి కర్నూలుకు హెచ్‌ఆర్‌సీని మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు 

ఏపీ హెచ్‌ఆర్‌సీ కార్యాలయాన్ని విజయవాడ నుంచి కర్నూలుకు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated : 27 Aug 2021 01:13 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్‌సీ) ప్రధాన కార్యాలయాన్ని కర్నూలుకు మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2017లో విజయవాడలో ఏపీహెచ్‌ఆర్‌సీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులకు సవరణ చేస్తూ ఈ కార్యాలయాన్ని విజయవాడ నుంచి కర్నూలుకు మారుస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. లోకాయుక్త, ఉప లోకాయుక్తను కర్నూలులో ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఇప్పటివరకు లోకాయుక్త, ఉపలోకాయుక్త కార్యాలయాలు హైదరాబాద్‌ నుంచి పనిచేశాయి. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని