Ap News: శాసన‌ వ్యవ‌స్థను నీరు గార్చేలా నిధుల నిర్వహ‌ణ: ఏపీ ఆర్థిక పరిస్థితిపై కాగ్‌ నివేదిక

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్ (కాగ్‌) నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2019-20 ఆర్థిక సంవ‌త్సరానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిపై కాగ్ ఇచ్చిన నివేదికను ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఏపీ ఆర్థిక ప‌రిస్థితి, వ‌న‌రుల నిర్వహ‌ణపై కాగ్ అభ్యంతరాలు...

Updated : 26 Nov 2021 16:45 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్ (కాగ్‌) నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2019-20 ఆర్థిక సంవ‌త్సరానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిపై కాగ్ ఇచ్చిన నివేదికను ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఏపీ ఆర్థిక ప‌రిస్థితి, వ‌న‌రుల నిర్వహ‌ణపై కాగ్ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆర్థిక వ్యవ‌హారాల్లో రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవ‌హ‌రించినట్లు నివేదికలో పేర్కొంది.

‘‘2019-20 ఆర్థిక సంవ‌త్సరానికి సంబంధించిన అనుబంధ ప‌ద్దుల‌ను వ్యయం చేసి, ఆ తర్వాత జూన్ 2020లో శాస‌నస‌భ‌లో ప్రవేశ పెట్టారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ఆర్థిక వ్యవ‌హారాలు చోటు చేసుకున్నాయి. చ‌ట్టస‌భ‌ల ఆమోద ప్రక్రియ‌ను, బ‌డ్జెట్ మీద అదుపును బ‌ల‌హీన‌ప‌రిచారు. ప్రజా వ‌న‌రుల వినియోగ నిర్వహ‌ణ‌లో ఆర్థిక క్రమ‌శిక్షణా రాహిత్యాన్ని ప్రోత్సహించారు. శాస‌నస‌భ ఆమోదించిన కేటాయింపుల కంటే అధికంగా ఖ‌ర్చు చేసిన సంద‌ర్భాలు పున‌రావృతం అవుతున్నాయి. అద‌న‌పు నిధులు అవసరమని భావిస్తే శాస‌నస‌భ నుంచి ముంద‌స్తు ఆమోదం పొందేలా చూసుకోవాలి. 2018-19 ఆర్థిక సంవ‌త్సరంతో పోల్చితే 2019-20లో 3.17 శాతం రెవెన్యూ రాబ‌డులు తగ్గాయి. కొత్త సంక్షేమ ప‌థ‌కాల వ‌ల్ల రెవెన్యూ ఖ‌ర్చులు 6.93 శాతం పెరిగాయి. 2018-19 నాటి రెవెన్యూ లోటును మించి 2019-20లో 90.24 శాతం రెవెన్యూ లోటు పెరిగింది. 2018-19 ఆర్థిక సంవత్సరంతో పొల్చితే 2019-20లో రూ.32,373 కోట్ల మేర బ‌కాయిల చెల్లింపులు పెరిగాయి. చెల్లించాల్సిన బ‌కాయిల వివ‌రాల‌ను బ‌డ్జెట్ ప‌త్రాల్లో స‌రిగా చూప‌లేదు. శాన‌స వ్యవ‌స్థను నీరు గార్చేలా నిధుల నిర్వహ‌ణ ఉంది’’ అని కాగ్‌ తన నివేదికలో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని