Updated : 20 Jan 2022 11:52 IST

PRC: ఏపీలో కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాల చెల్లింపు..

అమరావతి: ఏపీలో ఇటీవల ప్రకటించిన పీఆర్సీపై ఓ వైపు ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాల చెల్లింపునకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ట్రెజరీ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. సవరించిన పే స్కేల్స్‌ ఆధారంగా జీతాల్లో మార్పులు చేయాలని స్పష్టం చేసింది. మరోవైపు జీతాల చెల్లింపునకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను సీఎఫ్‌ఎంఎస్‌ సిద్ధం చేసింది.

పీఆర్సీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఇప్పటికే ఉద్యోగుల ఆందోళనలు ఉద్ధృతం చేశారు. నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్న ఉద్యోగులు చివరి అస్త్రంగా సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు. నిబంధనల ప్రకారం 14 రోజుల ముందు ఇవ్వాల్సిన సమ్మె నోటీసును... శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మకు ఇవ్వనున్నారు. ఈమేరకు ఏపీ ఐకాస, ఐకాస అమరావతి ఐక్యవేదిక ఆధ్వర్యంలో నేడు నిర్వహించే సమావేశంలో ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నారు.

మరోవైపు ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) పిలుపు మేరకు ఉపాధ్యాయులు ఈరోజు జిల్లాల కలెక్టరేట్లను ముట్టడించేందుకు యత్నించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ నిరసనలు కొనసాగించారు.  పీఆర్సీ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలనే డిమాండ్‌తో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు ఈ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పలుచోట్ల ఉపాధ్యాయ సంఘాల నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్‌ చేశారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని