AP News: మాస్క్‌ లేని వారిని రానిస్తే యాజమాన్యాలకు భారీ జరిమానా!

ఏపీలో కొవిడ్‌ వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం మరోమారు మార్గదర్శకాలు విడుదల చేసింది.

Updated : 10 Dec 2021 15:12 IST

మరోసారి మార్గదర్శకాలను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం 

అమరావతి: ఏపీలో కొవిడ్‌ వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం మరోమారు మార్గదర్శకాలు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం, డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ ధరించని వారికి రూ.100 జరిమానా వేయనున్నారు. మాస్క్‌ లేని వారిని దుకాణాలకు రానిస్తే యాజమాన్యాలకు భారీగా జరిమానా విధించనున్నారు. దుకాణాలు, వాణిజ్య ప్రదేశాలు, వ్యాపార సంస్థలకు రూ.10వేల నుంచి రూ.25వేల వరకు జరిమానా విధించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

ఈ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు 2 రెండు రోజుల పాటు వ్యాపార సంస్థలను మూసివేసేలా అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘనలు జరిగితే విపత్తు నిర్వహణ, ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కరోనా నిబంధనల ఉల్లంఘనలపై వాట్సాప్‌ ద్వారా 80109 68295 నంబరుకు ప్రజలు ఫిర్యాదు చేయొచ్చని సూచించింది. ప్రభుత్వ మార్గదర్శకాల అమలును పర్యవేక్షించాల్సిందిగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలను ఆదేశించింది.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు