Ap News: రాజధాని అమరావతిపై ఏపీ హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు

రాజధాని అమరావతిపై హైకోర్టులో రెండో రోజు వాదనలు కొనసాగాయి. రాజధాని అమరావతిపై విచారణ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర కీలక

Updated : 16 Nov 2021 16:21 IST

అమరావతి: రాజధాని అమరావతిపై హైకోర్టులో రెండో రోజు వాదనలు కొనసాగాయి. రాజధాని అమరావతిపై విచారణ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర కీలక వ్యాఖ్యలు చేశారు. 30 వేల మంది రైతులు స్వచ్ఛందంగా రాజధానికి భూములు ఇచ్చారన్నారు. అమరావతి రైతుల రాజధానే కాదు.. ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని అని స్పష్టం చేశారు. రాజధాని అమరావతి.. విశాఖ, కర్నూల్ సహా అందరిదన్నారు. స్వాతంత్ర్య సమరయోధులు కేవలం తమ కోసమే పోరాడలేదని.. దేశ ప్రజలందరి కోసం పోరాటం చేశారని విచారణ సందర్భంగా సీజే గుర్తు చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని