Ap News: ప్రభుత్వ వైఖరిపై హైకోర్టు అసహనం

ఉపాధి హామీ బిల్లుల బకాయిల చెల్లింపులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరిపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పదేపదే హామీ ఇచ్చి బిల్లులు ఎందుకు చెల్లించడం లేదని

Updated : 15 Jul 2021 19:14 IST

అమరావతి: ఉపాధి హామీ బిల్లుల చెల్లింపుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరిపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పదేపదే హామీ ఇచ్చి బిల్లులు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించింది. ఆగస్టు 1లోపు ఉపాధి హామీ పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని ఆదేశించింది. లేకపోతే పంచాయతీ రాజ్‌, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు న్యాయస్థానంలో హాజరుకావాల్సి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు విచారణను ఆగస్టు మొదటి వారానికి వాయిదా వేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని