AP high Court: ఏపీ ఫైబర్‌ నెట్‌ కేసులో సాంబశివరావుకు హైకోర్టులో ఊరట

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌)కు సంబంధించిన కేసులో రెండు రోజుల కిందట అరెస్టైన

Updated : 20 Sep 2021 13:37 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌)కు సంబంధించిన కేసులో రెండు రోజుల కిందట అరెస్టైన ఐఆర్‌టీఎస్‌ అధికారి కోగంటి సాంబశివరావు హైకోర్టులో ఊరట లభించింది. మధ్యంతర బెయిల్ పిటిషన్‌తో పాటు సీఐడీ నమోదు చేసిన కేసు కొట్టేయాలని నిన్న ఆయన దాఖలు చేసిన పిటిషన్‌లపై ఇవాళ విచారణ జరిగింది. పిటిషనర్‌ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. 48 గంటల్లో బెయిల్‌ రాకపోతే తన ఉద్యోగం పోతుందని పిటిషనర్‌ కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం సాంబశివరావుకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.

ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌కు సంబంధించిన తొలి దశ టెండర్లను గత ప్రభుత్వ హయాంలో టెరా సాఫ్ట్‌వేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు అక్రమంగా కట్టబెట్టారన్న ఆరోపణలపై నమోదైన కేసులో సాంబశివరావును సీఐడీ అధికారులు శనివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని