Ap Highcourt: ఆర్థిక శాఖ కార్యదర్శికి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణపై హైకోర్టు చర్యలకు ఆదేశించింది. సత్యనారాయణపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసిన హైకోర్టు.. అదుపులోకి తీసుకోవాలని

Updated : 24 Jul 2021 16:59 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణపై హైకోర్టు చర్యలకు ఆదేశించింది. సత్యనారాయణపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసిన హైకోర్టు.. అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది. కలిదిండి పంచాయతీ కార్యదర్శికి బకాయిలు చెల్లించాలని గతంలో సత్యనారాయణకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు అమలు చేసినప్పటికీ గత వాయిదాకు ఆయన ఆలస్యంగా హాజరయ్యారు. సత్యనారాయణ కోర్టు ధిక్కరణ చర్యలకు పాల్పడ్డారని.. కేసు విచారణలో కోర్టుకు ఆలస్యంగా వచ్చారని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. వారెంట్‌ రీకాల్‌ కోసం సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. జైలు శిక్షతో పాటు రూ.50వేల జరిమానా ఉంటుందని తెలిపింది. రూ.50వేల జరిమానాను న్యాయవాదుల సంక్షేమ నిధికి చెల్లించాలని ఆదేశించింది.

అనంతరం శిక్ష నిలిపివేయాలంటూ సత్యనారాయణ, ఆయన తరఫు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. వారి అభ్యర్థనను పరిశీలించిన ధర్మాసనం.. సత్యనారాయణకు జైలు శిక్ష అమలును వాయిదా వేస్తూ రూ.10 జరిమానా విధించింది. కేసు విచారణ సోమవారానికి వాయిదా వేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని