
AP High Court: కార్యాలయాల తరలింపుపై స్టే కొనసాగుతుంది: ఏపీ హైకోర్టు
అమరావతి: రాజధానిపై దాఖలైన వ్యాజ్యాలపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. రాజధాని కేసుల విచారణ కారణంగా చట్టానికి లోబడి అభివృద్ధి చేసుకునేందుకు అడ్డంకిగా ఉన్న మధ్యంతర ఉత్తర్వులను తొలగిస్తున్నామని త్రిసభ్య ధర్మాసనం వెల్లడించింది. ప్రభుత్వం కార్యాలయాలు, వివిధ శాఖల తరలింపుపై స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది. ప్రభుత్వం ఉపసంహరించుకున్న చట్టాలకు గవర్నర్ ఆమోదం పెండింగ్లో ఉన్నందున తదుపరి విచారణను డిసెంబర్ 27కి వాయిదా వేసింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.