ఆనందయ్య దరఖాస్తును వెంటనే పరిశీలించండి.. ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు ఆదేశం

నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య కంటి చుక్కల మందుపై హైకోర్టులో విచారణ జరిగింది. 

Updated : 25 Oct 2021 16:06 IST

అమరావతి: నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య కంటి చుక్కల మందుపై హైకోర్టులో విచారణ జరిగింది. తాను తయారు చేసే కంటి చుక్కల మందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసినట్లు హైకోర్టులో ఆనందయ్య రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దానిపై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఆ దరఖాస్తును వెంటనే పరిశీలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సాంకేతిక కారణాలు చూపి దరఖాస్తు తిరస్కరించొద్దని స్పష్టం చేసింది. కాగా, తమకు దరఖాస్తు చేయలేదని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

ఈ సందర్భంగా దరఖాస్తు, ప్రభుత్వ జవాబును ఆనందయ్య తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. ఆనందయ్య కంటి చుక్కల మందుతో ప్రమాదం ఉందని ప్రభుత్వ తరఫు న్యాయవాది ఉన్నత న్యాయస్థానానికి వివరించారు. దీనిపై స్పందించిన కోర్టు.. కరోనా వల్ల ప్రభుత్వాసుపత్రిలో ఎందరు మరణించారని ప్రశ్నించింది. ఆనందయ్య మందు వల్ల ఎంతమంది మరణించారు అని అడిగింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని