AP high court: అమరావతి రైతులకు హైకోర్టులో ఊరట

అమరావతికి రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు హైకోర్టులో ఊరట లభించింది. రైతులకు ఇచ్చిన

Updated : 24 Sep 2022 16:32 IST

అమరావతి: అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు హైకోర్టులో ఊరట లభించింది. రైతులకు ఇచ్చిన రిటర్న్‌ గిప్ట్‌ ప్లాట్లను స్వాధీనం చేసుకుంటామని ఇటీవల ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో సంబంధిత రైతులు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేయగా.. ఇవాళ దానిపై విచారణ జరిగింది. రైతులకు రిటర్న్‌ గిప్ట్‌గా ఇచ్చిన ప్లాట్లను స్వాధీనం చేసుకోవడం చట్ట విరుద్ధమని రైతుల తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. గతంలో చేసుకున్న ఒప్పందాల ప్రకారమే ప్లాట్లను ఇచ్చినట్లు ఆ నిర్ణయాన్ని కచ్చితంగా అమలు చేయాలని ధర్మాసనానికి తెలిపారు. దీంతో ఆ జీవోను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. జీవోకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవద్దని ఏఎంఆర్డీఏను ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని