AP High Court: తితిదే బోర్డులో నేరచరిత్ర ఉన్నవారి నియామకంపై హైకోర్టు ఆగ్రహం

తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) బోర్డులో నేర చరిత్ర ఉన్నవారి నియామకంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 

Updated : 27 Oct 2021 12:13 IST

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) బోర్డులో నేర చరిత్ర ఉన్నవారి నియామకంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తితిదే పాలకమండలి నియామకాన్ని సవాల్‌ చేస్తూ భాజపా నేత భానుప్రకాశ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిగింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది అశ్వినికుమార్‌ వాదనలు వినిపించారు. ఎంసీఐ మాజీ ఛైర్మన్‌ డా.కేతన్‌ దేశాయ్‌ నియామకంపై అశ్వినికుమార్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం.. తితిదే కార్యనిర్వాహణాధికారి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు మొత్తం 18 మంది సభ్యులకు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు వారిని ఆదేశించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని