AP high court: పిటిషనర్లతో మాట్లాడి నాలుగు వారాల్లో ఫీజులు నిర్ణయించండి: హైకోర్టు 

ఏపీలోని ప్రైవేట్‌ అన్‌ అయిడెడ్‌ ఫీజుల నిర్ధారణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అప్పీలపై హైకోర్టు తీర్పు వెలువరించింది.

Updated : 07 Oct 2021 11:49 IST

అమరావతి: ఏపీలోని ప్రైవేట్‌ అన్‌ అయిడెడ్‌ కళాశాలల ఫీజుల నిర్ధారణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అప్పీలపై హైకోర్టు తీర్పు వెలువరించింది. సింగల్‌ జడ్జి ఉత్తర్వులను హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ పక్కనబెట్టింది. నిబంధనల ప్రకారం ఫీజులు చెల్లించేందుకు 4 వారాల సమయం ఇచ్చింది. పిటిషనర్లతో మాట్లాడి 4 వారాల్లో ఫీజులు నిర్ణయించాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల ఫీజులను నియంత్రిస్తూ ప్రభుత్వం గతంలో జీవో ఇచ్చింది. కాగా, ఈ జీవోను సవాల్‌ చేస్తూ డిగ్రీ కళాశాలలు యాజమాన్యాలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాయి.

డిగ్రీ కళాశాలలను 3 కేటగిరీలుగా విభజించి ఫీజులు నిర్ణయించడం చట్టవిరుద్ధమని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు. ప్రభుత్వ జీవోను కొట్టివేస్తూ గతంలో హైకోర్టు సింగిల్‌ జడ్జి ఉత్వర్వులు ఇచ్చారు. నిబంధనల ప్రకారం నిర్ణయించే వరకు పాత ఫీజులే వసూలు చేసుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, సింగిల్‌ జడ్జి ఉత్వర్వులపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్‌ చేసింది. ఇరువురి వాదనలు విని న్యాయస్థానం తీర్పు రిజర్వ్‌ చేసింది. కాగా, ఇవాళ వెలువరించిన తీర్పులో డివిజినల్‌ బెంచ్‌ సింగిల్‌ బెంచ్‌ ఉత్వర్వులను పక్కనబెట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని