AP News: ఏపీలో ఉద్యోగ సంఘాల పోరుబాట.. కార్యాచరణ ప్రకటించిన నేతలు

పీఆర్సీతో పాటు పలు డిమాండ్ల సాధన కోసం ఏపీలో ఉద్యోగ సంఘాలు పోరుబాట పట్టాయి. ఇప్పటికే పలు దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో..

Published : 29 Nov 2021 01:09 IST

విజయవాడ: పీఆర్సీతో పాటు పలు డిమాండ్ల సాధన కోసం ఏపీలో ఉద్యోగ సంఘాలు పోరుబాట పట్టాయి. ఇప్పటికే పలు దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఉద్యోగ సంఘాల నేతలు ఇవాళ విజయవాడలో సమావేశమై చర్చించారు.  సమావేశం ముగిసిన తర్వాత ఏపీ జేఏసీ ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ఉద్యమ కార్యచరణ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల వివక్ష చూపుతోందని ఆరోపించారు. పీఆర్‌సీ నివేదిక ఇస్తామని చెప్పి మాట తప్పారని విమర్శించారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలన్నారు. ఉద్యోగులను కార్యాచరణ దిశగా ప్రభుత్వమే నెట్టిందని ఆరోపించారు. విధులు నిర్వహిస్తూనే నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటామన్నారు.

డిసెంబరు 1న సీఎస్‌కు వినతి పత్రం సమర్పిస్తాం.

డిసెంబరు 7 నుంచి 10 వరకు నల్లబ్యాడ్జీలు ధరిస్తాం. 
డిసెంబరు 13న అన్ని డివిజన్‌ కేంద్రాల్లో  నిరసన ప్రదర్శలు 
21న జిల్లా కేంద్రాల్లో మహాధర్నా నిర్వహిస్తాం.
డిసెంబరు 27న సాయంత్రం 4గంటలకు విశాఖలో సదస్సు
డిసెంబరు 30న తిరుపతిలో సదస్సు

 జనవరి 3న ఏలూరులో, 6న ఒంగోలులో భారీ సదస్సు నిర్వహిస్తామని బండి శ్రీనివాసరావు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని