AP News: రమ్య కుటుంబానికి రూ.10లక్షల చెక్కు అందజేసిన హోంమంత్రి సుచరిత

దారుణహత్యకు గురైన బీటెక్‌ విద్యార్థిని రమ్య కుటుంబసభ్యులను ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత పరామర్శించారు.

Updated : 16 Aug 2021 12:43 IST

గుంటూరు: దారుణహత్యకు గురైన బీటెక్‌ విద్యార్థిని రమ్య కుటుంబసభ్యులను ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత పరామర్శించారు. గుంటూరు జీజీహెచ్‌లో కుటుంబసభ్యులతో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్‌ ప్రకటించిన రూ.10లక్షల చెక్కును మృతురాలి కుటుంబసభ్యులకు సుచరిత అందజేశారు.

పట్టపగలే నడిరోడ్డుపై జనం చూస్తుండగానే రమ్యను (20) శశికృష్ణ (24) అనే యువకుడు కత్తితో పొడిచి అత్యంత పాశవికంగా హతమార్చాడు. గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే ప్రధాన రహదారిలో పరమయ్యగుంట సెంటరువద్ద ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని