AP News: సజ్జల బెదిరిస్తున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవం: బండి శ్రీనివాసరావు

రెండు రోజలు కిందట ప్రెస్‌మీట్‌లో ఉండగా తనను ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్‌లో బెదిరించినట్లు

Updated : 09 Oct 2021 11:23 IST

విజయవాడ: రెండు రోజలు కిందట ప్రెస్‌మీట్‌లో ఉండగా తనను ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్‌లో బెదిరించినట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు స్పష్టతనిచ్చారు. ఉద్యోగుల డిమాండ్లన్నీ విన్నవించుకునేందుకు సచివాలయంలో తమకు అందుబాటులో ఉంటే వ్యక్తి సజ్జల అన్న ఆయన.. అవాస్తవ వార్తల ద్వారా తమ బంధాన్ని చెడగొట్టొద్దని విజ్ఞప్తి చేశారు.

‘‘కలిసికట్టుగా పోరాడుతున్నందుకు సజ్జల శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రభుత్వం ఫ్రెండ్లీ అని సజ్జల అన్నారు. ఉద్యోగ సంఘాలన్నీ మా కంట్రోల్‌లోనే ఉన్నాయని సజ్జలకు చెప్పాం. ఫ్రెండ్లీ ప్రభుత్వంతో ఘర్షణ ధోరణి ఉండొద్దని సజ్జల చెప్పారు. మాపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఏ రాజకీయ పార్టీకి తొత్తులుగా వ్యవహరించబోము’’ అని బండి శ్రీనివాసరావు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు