AP News: ఏపీలోని మోడల్‌ స్కూళ్లలో ఉపాధ్యాయుల బదిలీలకు ఆమోదం

ఏపీలోని మోడల్‌ స్కూళ్లలో ఉపాధ్యాయుల బదిలీలకు ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను పాఠశాల విద్యాశాఖ జారీ చేసింది.

Published : 30 Nov 2021 21:59 IST

అమరావతి: ఏపీలోని మోడల్‌ స్కూళ్లలో ఉపాధ్యాయుల బదిలీలకు ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను పాఠశాల విద్యాశాఖ జారీ చేసింది. మోడల్‌ స్కూళ్లలో పనిచేస్తున్న టీజీటీ, పీజీటీలకు సాధారణ బదిలీలు చేసేందుకు ఆమోదం తెలియజేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. 2021 నవంబరు 1 నాటికి ఐదేళ్ల పాటు ఒకే చోట పనిచేసిన వారు బదిలీకి అర్హులని పేర్కొంది. ఒకే చోట పనిచేస్తూ రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు రిక్వెస్ట్‌ ట్రాన్స్‌ఫర్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఖాళీలు, సీనియారిటీ, సర్వీస్‌ పాయింట్లు, ఆరోగ్యం తదితర అంశాల ఆధారంగా కౌన్సిలింగ్‌ ద్వారా బదిలీల ప్రక్రియ చేపట్టనున్నట్టు వెల్లడించింది. డిసెంబరు 31లోగా బదిలీల షెడ్యూల్‌ జారీ చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని