ATA: అమెరికాలో తెలుగువారు లేని రాష్ట్రం లేదు: కిషన్‌రెడ్డి

అమెరికాలో తెలుగువారు లేని రాష్ట్రం లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. అనేక రంగాల్లో తెలుగువారు రాణిస్తు్న్నారని కొనియాడారు.

Updated : 27 Dec 2021 10:56 IST

హైదరాబాద్‌: అమెరికాలో తెలుగువారు లేని రాష్ట్రం లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. అనేక రంగాల్లో తెలుగువారు రాణిస్తు్న్నారని కొనియాడారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (ఆటా) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేడుకల్లో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఆటా చేపట్టిన సామాజిక సేవల్ని కొనసాగించాలని కేంద్రమంత్రి సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు వెళ్తోందని మంత్రి ప్రశాంత్‌రెడ్డి వెల్లడించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సినీనటులు సుమన్‌, బాలచందర్‌, మధు బొమ్మినేని, భువనేశ్‌ భుజాల, అనిల్‌ బోదిరెడ్డి, ఆటా ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని