TSRTC: ఆర్టీసీ ఆస్తులను అమ్మే ప్రసక్తే లేదు: బాజిరెడ్డి

రైల్వే ఆస్తులను అమ్మినట్లు ఆర్టీసీ ఆస్తులను అమ్మే ప్రసక్తే లేదని టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ స్పష్టం చేశారు.

Updated : 20 Sep 2021 13:05 IST

హైదరాబాద్‌: రైల్వే ఆస్తులను అమ్మినట్లు ఆర్టీసీ ఆస్తులను అమ్మే ప్రసక్తే లేదని టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ స్పష్టం చేశారు. ఆర్టీసీ ఛైర్మన్‌గా ఆయన హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్డు వద్ద గల బస్‌భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్‌, ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా బాజిరెడ్డిని కేటీఆర్‌ అభినందించారు. ఆర్టీసీని నష్టాల బాట నుంచి గట్టెక్కించేందుకు దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి స్థాయి ఎండీని నియమించింది. తాజాగా సంస్థ ఛైర్మన్‌గా సీనియర్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డికి బాధ్యతలు అప్పగించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని