AP NGO: ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నా.. కూల్చాలన్నా మా చేతుల్లోనే: బండి శ్రీనివాసులు

ప్రభుత్వ ఉద్యోగులను మోసపూరిత మాటలతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్‌ .. తర్వాత తమను పట్టించుకోవడం మానేశారని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసులు మండిపడ్డారు.

Updated : 05 Dec 2021 19:08 IST

అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులను మోసపూరిత మాటలతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్‌ .. తర్వాత తమను పట్టించుకోవడం మానేశారని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసులు మండిపడ్డారు. ఉద్యోగుల అంతర్గత సమావేశంలో ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల ఉద్యమానికి ఎవరైన తలవంచాల్సిందేనని ఘాటుగా హెచ్చరించారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో హల్‌చల్‌ చేస్తోంది.

‘‘నేను విన్నాను.. నేను ఉన్నాను.. అని మీరు చెప్పిన మాయ మాటలు నమ్మి 151 సీట్లు తెచ్చాం. మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో విజయం ఆరిపోయే దీపానికి వెలుగువంటిది. ఉద్యోగులంటే ఏంటో చంద్రబాబుకు బాగా తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఒక్కొక్క ఉద్యోగి ఇంట్లో ఐదు ఓట్లు ఉంటాయి. సుమారు 60 లక్షల ఓట్లతో ప్రభుత్వాన్ని కూల్చవచ్చు, నిలబెట్టవచ్చు. ఈ శక్తి ముందు ఎవరైనా తలవంచాల్సిందే. రైతుల ఉద్యమానికి తలవంచి సాక్షాత్తూ ప్రధానమంత్రి తప్పై పోయిందని  ఒప్పుకున్నారు. ఉద్యమం ద్వారానే హక్కులను సాధించుకుంటాం. మీ దయా దాక్షిణ్యాల మీద కాదు. ఉద్యోగులు చచ్చిపోతున్నా కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. 1వ తేదీన జీతం తీసుకోవడం అనేది రాజ్యంగం పొందుపరిచిన హక్కు. పాలవాళ్లు, కూరగాయల వాళ్ల దగ్గర ప్రభుత్వ ఉద్యోగులు లోకువైపోయారు’’ అని బండి శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని