Bathukamma: నేడు రాత్రి బుర్జ్ ఖలిఫాపై బతుకమ్మ సంబురం
తెరాస ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో బతుకమ్మ ఘనతను మరోసారి విశ్వవేదికపై చాటనున్నారు. ప్రపంచంలోనే ఎత్తయిన దుబాయ్‌లోని
దుబాయ్: తెరాస ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో బతుకమ్మ ఘనతను మరోసారి విశ్వవేదికపై చాటనున్నారు. ప్రపంచంలోనే ఎత్తయిన దుబాయ్‌లోని బుర్జ్‌ఖలీఫాపై ఈరోజు రాత్రి 9.40 నిమిషాలకు, 10.40 నిమిషాలకు బతుకమ్మ వీడియో ప్రదర్శించనున్నారు. మూడేసి నిమిషాల నిడివిగల ఈ వీడియోల్లో తెలంగాణలో బతుకమ్మ ప్రాశస్త్యం, విశిష్టత, సంబురాల సంస్కృతిని తెలియజేస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాన్ని సైతం మొత్తం సౌధంపై ప్రదర్శిస్తారు. బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మను ప్రదర్శించబోయే తెర ప్రపంచంలోనే అతి పెద్దది. ఒకేసారి లక్ష మంది దీన్ని వీక్షించనున్నారు.
ఈ కార్యక్రమం కోసం దుబాయ్ చేరుకున్న కవిత బృందానికి ప్రవాసులు ఘనంగా స్వాగతం పలికారు. ఆమె వెంట ఎమ్మెల్యేలు బాజిరెడ్డి, గణేశ్ గుప్తా, సురేందర్, షకీల్, జీవన్‌రెడ్డి, సంజయ్, రాజ్యసభ సభ్యులు సురేశ్ రెడ్డి తదితరులు ఉన్నారు. దుబాయ్ వీధుల్లో భారీ ర్యాలీతో వీరికి ప్రవాస తెలంగాణ వాసులు స్వాగతం చెప్పారు. బతుకమ్మ పండుగ ఖ్యాతిని ప్రపంచమంతటా చాటి చెప్పేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు కవిత ఈ సందర్భంగా తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
C-Vigil: సీ-విజిల్‌కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్‌సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM