Off beat: వివాహ విందులో ఆహారం మిగిలిందని.. ఆ మహిళ ఏం చేసిందో తెలుసా..?

భారత్‌లో పెళ్లిళ్లు అంటే భారీదనానికి పెట్టింది పేరు. పెళ్లి తంతు మొదలైన దగ్గరి నుంచి ప్రతి చిన్న కార్యక్రమంలోనూ తమ తాహతు కనిపించేలా ఏర్పాట్లు ఉంటాయి. ఇక ఆతిథ్యం విషయంలో ఏమాత్రం తగ్గేదేలే.

Published : 07 Dec 2021 02:10 IST

కోల్‌కతా: భారత్‌లో పెళ్లిళ్లు అంటే భారీతనానికి పెట్టింది పేరు. పెళ్లి తంతు మొదలైన దగ్గరి నుంచి ప్రతి చిన్న కార్యక్రమంలోనూ తమ తాహతు కనిపించేలా ఏర్పాట్లు ఉంటాయి. ఇక ఆతిథ్యం విషయంలో ఏమాత్రం తగ్గేదేలే. వేడుకకు వచ్చిన ఆత్మీయులు రుచికరమైన భోజనం చేయాలని రకరకాల వంటలు సిద్ధం చేస్తారు. ఈ క్రమంలోనే ఆహారపదార్థాలు మిగిలిపోతుంటాయి. అవన్నీ వృథా అవుతున్నా.. పెళ్లి హడావుడిలో పడి వాటిని పట్టించుకునే అవకాశం ఉండకపోవచ్చు..! 

అయితే నీలాంజన్ మండల్ అనే వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ షేర్ చేసిన దృశ్యాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. పశ్చిమ్ బెంగాల్‌లోని రాణాఘట్ రైల్వే స్టేషన్‌లో అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో తన కెమెరా కంటికి చిక్కిన దృశ్యాలు ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. పాపియా కర్ అనే మహిళ తన సోదరుడి వివాహ విందులో మిగిలిన వంటల్ని తీసుకొచ్చి,  రైల్వే స్టేషన్‌ వద్ద అభాగ్యులకు పంచుతూ కనిపించారు. తను ముస్తాబైన దుస్తుల్లోనే అక్కడికి వచ్చి, రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాంపై కూర్చొని ఆకలితో అలమటిస్తున్నవారికి స్వయంగా వడ్డించారు. ఆమె పెట్టే అన్నం కోసం పెద్దల నుంచి చిన్నపిల్లల వరకు చాలామంది ఆమె చుట్టూ గుమిగూడారు. ఇలా అన్నార్తులకు కడుపు నిండా తిండి పెట్టడం ఆమెకు కొత్తేం కాదని స్థానికులు వెల్లడించారు. కాగా, ఆమె చూపిన చొరవపై నెట్టింట్లో ప్రశంసలు దక్కుతున్నాయి. ఇలాంటి చర్యలు ఇతరులకు ప్రేరణగా నిలుస్తాయని పలువురు అభినందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని