Ganesh immersion: హైదరాబాద్‌లో 19న గణేశ్‌ నిమజ్జనం: భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి

నగరంలోని అన్ని మండపాల నిర్వాహకులు ఈనెల 19న గణేశ్‌ నిమజ్జనం చేయాలని భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు విజ్ఞప్తి చేశారు. గురువారం

Updated : 16 Sep 2021 17:46 IST

 

హైదరాబాద్‌: నగరంలోని అన్ని మండపాల నిర్వాహకులు ఈనెల 19న గణేశ్‌ నిమజ్జనం చేయాలని భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు చెప్పారు.  ప్రభుత్వం, గణేశ్‌ ఉత్సవ సమితి కలిసి వచ్చే ఏడాది హైకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. ‘‘హుస్సేన్‌ సాగర్‌లోనే నిమజ్జనం జరిగేలా విజయం సాధిస్తాం. నిమజ్జనం అనంతరం పీఓపీ పరీక్షలు చేసి హైకోర్టుకు నివేదిక ఇస్తాం. హైకోర్టుకు ప్రభుత్వం సరైన నివేదిక ఇవ్వకపోవడం వల్లే నిమజ్జనంపై సందిగ్ధత తలెత్తింది’’ అని భగవంతరావు అన్నారు.

హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనానికి ఇవాళ సుప్రీంకోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. నిమజ్జనం చేసుకోవచ్చని.. ఈ ఏడాదికే మినహాయింపు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. హుస్సేన్‌సాగర్‌లో పీవోపీ (ప్లాస్టర్‌ ఆఫ్ పారిస్‌) విగ్రహాల నిమజ్జనానికి వీల్లేదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ ఏడాది నిమజ్జనానికి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని