Ganesh Immersion: సుప్రీం తీర్పు తర్వాత నిర్ణయం తీసుకుంటాం: తలసాని

హుస్సేన్‌సాగర్‌లో గణేష్ నిమజ్జనంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లనుందని.. తీర్పు వచ్చిన వెంటనే సర్కార్‌ నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర పశుసంవర్థక శాఖ...

Updated : 14 Sep 2021 19:18 IST

హైదరాబాద్: హుస్సేన్‌సాగర్‌లో గణేష్ నిమజ్జనంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లనుందని.. తీర్పు వచ్చిన వెంటనే సర్కార్‌ నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. వినాయక నిమజ్జన ఉత్సవాలపై భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి సభ్యులు మంత్రిని కలిశారు. నిమజ్జనాలపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు. సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు వెలువరించినా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం భక్తుల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరించాలని ఉత్సవ సమితి అధ్యక్షుడు భగవంత్‌రావు మంత్రికి విజ్ఞప్తి చేశారు. వినాయకుడిని ప్రతిష్ఠించి నిమజ్జనం చేయడం తరతరాలుగా వస్తున్న సంప్రదాయమన్నారు. సంప్రదాయాలను కోర్టులు, ప్రభుత్వం గౌరవించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిమజ్జనానికి సంబంధించి హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం దాఖలు చేసిన హౌస్‌ మోషన్ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు