Bharat Bandh: ప్రశాంతంగా కొనసాగుతున్న భారత్‌ బంద్‌

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు మేరకు దేశవ్యాప్తంగా

Updated : 27 Sep 2021 10:40 IST

ఇంటర్నెట్ డెస్క్‌: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈ ఉదయం ప్రారంభమైన భారత్‌ బంద్‌ ప్రశాంతంగా సాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు బంద్‌లో పాల్గొ్న్నాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతికేరంగా నినాదాల చేస్తూ ర్యాలీలు నిర్వహించాయి. దుకాణదారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసేశారు. ఏపీలో ఈ మధ్యాహ్నం వరకు బస్సు సర్వీసులు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

కడప జిల్లా వ్యాప్తంగా 8 డిపోల పరిధిలో తొమ్మిది వందల బస్సు సర్వీసులు డిపోలకే పరిమితమయ్యాయి. అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని  బస్టాండ్ వద్ద నిరసన తెలియజేశారు. విశాఖ పాడేరు ఏజెన్సీలోని 11 మండలాల్లో బంద్ ప్రభావం కనబడింది. ఆందోళకారులు వాహనాలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. తిరుపతిలో బంద్‌ కొద్దిపాటి ఉద్రిక్తతకు దారి తీసింది. వామపక్షాలు, కార్మిక సంఘాల నాయకులు రైల్వేస్టేషన్‌లోకి వెళ్లేందుకు  ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అమరావతిలో వర్షం పడుతున్నా సీపీఐ, సీపీఎం నాయకులు బంద్‌లో పాల్గొన్నారు.

తెలంగాణలోని పలు బస్సు డిపోల ముందు వామపక్షాలు ఆందోళనకు దిగాయి. హైదరాబాద్‌లో బంద్‌ పాక్షికంగా కొనసాగుతోంది. ఉప్పల్‌, కూకట్‌పల్లి డిపోల ముందు పలువురు నాయకులు ఆందోళన చేపట్టారు. నల్గొండలో వామపక్షాలు ధర్నా చేపట్టాయి. సూర్యాపేట జిల్లా కోదాడలోనూ బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని