
Governor Tamilisai: ధైర్యానికి ఎస్‌ఎస్‌జీ ప్రతీక: తెలంగాణ గవర్నర్ తమిళిసై
హైదరాబాద్: నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్‌ఎస్‌జీ) ధైర్యానికి ప్రతీక అని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఎన్నో గొప్ప ఆపరేషన్లను ఎస్‌ఎస్‌జీ విజయవంతంగా నిర్వహించిందన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్‌ఎస్‌జీ) ఆధ్వర్యంలో ‘సుదర్శన్ భారత్ పరిక్రమ’ కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా విశాఖ నుంచి హైదరాబాద్ చేరుకున్న బ్లాక్ క్యాట్ కారు ర్యాలీని నెక్లస్ రోడ్డులో తమిళిసై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలోని మేజర్ వార్ మెమోరియల్ స్థలాలను ఎస్‌ఎస్‌జీ సందర్శించడం ఆనందంగా ఉందన్నారు. ఎస్‌ఎస్‌జీ వంటి భద్రతా సంస్థల వల్లే దేశంలో ప్రజలంతా ప్రశాంతంగా ఉన్నారని చెప్పారు. ఈ బ్లాక్ క్యాట్ ర్యాలీ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. మార్షల్ ఆర్ట్స్‌ను విద్యలో భాగం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను గవర్నర్ కోరారు.
బ్లాక్ క్యాట్ ర్యాలీ ఈనెల 30న దిల్లీ చేరుకోనుంది. 12 రాష్ట్రాల్లోని 18 నగరాల మీదుగా 7,500 కి.మీ మేర ఈ ర్యాలీ కొనసాగి దిల్లీలోని జాతీయ పోలీస్ స్మారక చిహ్నం వద్ద ముగియనుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.