AP High Court: కార్పొరేషన్ ద్వారా రుణసేకరణ.. ఉక్కు పరిశ్రమ పిటిషన్ల విచారణ వాయిదా

కార్పొరేషన్‌ ద్వారా రుణ సేకరణ అంశంపై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ ద్వారా రుణ సేకరణను అభ్యంతరం వ్యక్తం చేస్తూ విశాఖ తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ..

Updated : 08 Sep 2021 12:44 IST

అమరావతి: కార్పొరేషన్‌ ద్వారా రుణ సేకరణ అంశంపై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ ద్వారా రుణ సేకరణను అభ్యంతరం వ్యక్తం చేస్తూ విశాఖ తూర్పు తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై న్యాయవాదులు బసవ ప్రభుపాటిల్‌, బాలాజీ వాదనలు వినిపించారు. ఆర్‌బీఐ, కాగ్‌, మరో 5 బ్యాంకులను ఇంప్లీడ్‌ చేయాలని పిటిషనర్‌ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. పిటిషనర్‌ ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదించారు. ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు వినిపించారు. బ్యాంకులు, కాగ్‌, కేంద్రాన్ని ఇంప్లీడ్‌ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని దవే కోర్టుకు తెలిపారు. పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలుకు 4 వారాల సమయం కావాలని ఆయన కోర్టును కోరారు. దీంతో కేసు విచారణను ఉన్నత న్యాయస్థానం వాయిదా వేసింది.

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ పిటిషన్లపై విచారణ..
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై దాఖలైన పిటిషన్లపై కూడా హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. సీబీఐ విశ్రాంత అధికారి లక్ష్మీనారాయణ, మరొకరు వేసిన పిటిషన్లు విచారణకు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వ కౌంటర్‌పై వివరణకు పిటిషనర్‌ తరఫు న్యాయవాది సమయం కోరారు. దీంతో ఉన్నత న్యాయస్థానం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని