TS News: ఉపకారం మరువని ఉడత.. ఎక్కడికీ వెళ్లదోచ్!
రామాయణంలో ఉడుత సాయం గురించి విన్నాం.. కానీ, తనకు సాయం చేసిన వారిని వదిలిపెట్టకుండా వారి వెన్నంటే ఉంటూ అందరినీ ఆశ్చర్యానికి..
సూర్యాపేట: రామాయణంలో ఉడుత సాయం గురించి విన్నాం.. కానీ, తనకు సాయం చేసిన వారిని వదిలిపెట్టకుండా వారి వెన్నంటే ఉంటూ అందరినీ ఆశ్చర్యానికి గరిచేస్తోన్న ఈ ఉడుత గురించి తెలుసా?. ఈ విచిత్రం చూడాలంటే సూర్యాపేట వెళ్లాల్సిందే. సూర్యాపేట-జనగామ కూడలి వద్ద ఖలీమ్ దంపతులు టీ స్టాల్, గాలి మిషన్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు అస్లాం ఏడో తరగతి చదువుతున్నాడు. ఆన్‌లైన్ తరగతులు వింటూ తల్లిదండ్రుల వ్యాపారానికి సహకరిస్తున్నాడు. అయితే, 3నెలల క్రితం వారి ఇంటి పరిసరాల్లో పెద్దగా కాకుల అరుపులు వినిపించాయి. ఏంటా అని వెళ్లి చూడగా.. చెట్టుపై గూటిలో ఉన్న ఉడుత పిల్లను కాకులు పొడవడాన్ని గమనించాడు. కాకులపై రాయి విసిరి వాటిని చెదరగొట్టాడు. చెట్టుపై నుంచి గాయాలతో ఉన్న ఉడుత పిల్ల కింద పడింది. కళ్లు కూడా తెరవని రోజుల వ్యవధి వయసున్న ఉడుత పిల్లను తీసుకున్న బాలుడు దాన్ని బతికించాలని తల్లిదండ్రుల వద్దకు తీసుకొచ్చాడు. ఉడుత పిల్ల బతకదని తల్లిదండ్రులు చెప్పేసరికి బాలుడు బోరున విలపించాడు. కుమారుడి బాధ చూడలేక ఉడుత పిల్ల గాయాలకు పసుపువేసి కట్టు కట్టి పాలు పట్టించారు. ఇలా వైద్యం చేస్తుండగా ఉడుత పిల్ల 20 రోజుల్లో పూర్తిగా కోలుకుంది.
ఉడుత కోసం ప్రత్యేకంగా బాక్సు
ఉడుత కోసం ప్రత్యేకంగా ఓ బాక్సు తయారు చేయించారు. అందులో వస్త్రాలు పెట్టి గూడులా ఏర్పాటు చేశాడు. వారు ఏర్పాటుచేసిన పెట్టే దాని ఆవాసమైంది. ఆకలి అయితే అరుపులతో వారికి గుర్తు చేస్తుంది. పాలు, పండ్లు లాంటివి పెడితే తింటుంది. కుటుంబ సభ్యులందరితో కలిసిపోయింది. వారు ఇంట్లో ఉండే సమయాల్లో దాన్ని వదిలేస్తారు. వదిలిన సమయంలో కుటుంబ సభ్యులందరిపై అతి సాన్నిహిత్యంగా తిరుగుతుంది. ఉడుతను ఈ కుటుంబ సభ్యులు తమలో ఒకరిగా భావిస్తున్నారు. నిద్రించే సమయాల్లో కూడా వారి పక్కనే చోటు కల్పిస్తున్నారు. ఉడుత కోసం ప్రత్యేకంగా పండ్లు, పాలు పెట్టి రక్షిస్తున్నారు. పొద్దున లేవగానే ఉడుత పలకరించనిదే పనులు మొదలు పెట్టరు. కుటుంబ సభ్యులంతా ఇటీవల నెల్లూరులో శుభకార్యానికి వెళ్లగా వారితో పాటు ఉడుతను కూడా తీసుకెళ్లారు. రైల్లో తమతో పాటు ఉన్న ఉడుతను చూసి తోటి ప్రయాణికులు సెల్ఫీ తీసుకుని ఆనందం వ్యక్తం చేశారని ఖలీమ్ తెలిపారు. మనిషి రోడ్డు ప్రమాదంలో గాయపడి గిల గిల కొట్టుకుంటున్నా... చూసి తమకెందుకులే అని వెళ్లిపోతున్న ఈ రోజుల్లో కళ్లు కూడా తెరవని ఉడుతను తీసుకొచ్చి సపర్యలు చేసి రక్షించడం అభినందనీయం. అందుకు కృతజ్ఞతగా.. చెట్టుపై ఉండాల్సిన ఈ మూగజీవం తనకు ఉపకారం చేసిన కుటుంబంతో జీవించడం ఆశ్చర్యం కలిగిస్తోంది కదూ!.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Property: ఏనుగుల కోసం రూ.5 కోట్ల ఆస్తి
-
India News
మహిళలకు ప్రతీనెలా రూ.వెయ్యి పంపిణీ
-
India News
Lottery: సినీ నటి ఇంట్లో సహాయకుడు.. ఇప్పుడు కోటీశ్వరుడు
-
India News
క్యాన్సర్, అధిక రక్తపోటుకు అల్లోపతిలో చికిత్స లేదు: బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
Politics News
కేజ్రీవాల్ విందు భేటీ విఫలం.. హాజరుకాని ముఖ్యమంత్రులు
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/03/23)