
Updated : 08 Oct 2021 17:05 IST
Brahmotsavam: చినశేష వాహనంపై దర్శనమిచ్చిన శ్రీనివాసుడు
తిరుమల: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు చినశేష వాహనంపై మలయప్పస్వామి దర్శనమిచ్చారు. కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఆలయంలోని కల్యాణ మండపంలో శ్రీవారి వాహనసేవలు నిర్వహిస్తున్నారు. గురువారం పెద్ద శేష వాహనంపై విహరించిన శ్రీనివాసుడు.. శుక్రవారం ఉదయం చిన శేష వాహనంపై దర్శనమిచ్చారు. ఈరోజు రాత్రి స్వామివారికి హంస వాహన సేవ జరగనుంది.
Advertisement
Tags :