Sleep: హాయిగా నిద్రపోతే పాతిక లక్షలు.. బ్రిటన్ కంపెనీ బంపర్ ఆఫర్
‘ఉత్తినే తిని తొంగుంటే ఏటొస్తదీ!’ అంటాడు బాపు తీసిన ‘ముత్యాలముగ్గు’ సినిమాలో రావు గోపాలరావు. ఈ మాటకు.. బ్రిటన్‌లోని ఓ కంపెనీ ‘పాతిక లక్షలు వస్తాయి’ అంటోంది. వీళ్లు ఇవ్వజూపుతున్న ఉద్యోగావకాశం గురించి వింటే ఎవరికైనా మతి
లండన్: ‘ఉత్తినే తిని తొంగుంటే ఏటొస్తదీ!’ అంటాడు బాపు తీసిన ‘ముత్యాలముగ్గు’ సినిమాలో రావు గోపాలరావు. ఈ మాటకు.. బ్రిటన్‌లోని ఓ కంపెనీ ‘పాతిక లక్షలు వస్తాయి’ అంటోంది. వీళ్లు ఇవ్వజూపుతున్న ఉద్యోగావకాశం గురించి వింటే ఎవరికైనా మతి పోవడం ఖాయం. ఈ ఉద్యోగానికి చేయవలసిందల్లా రోజుకు ఆరేడు గంటలు మెత్తటి పరుపుపై పడుకోవడం.. విసుగ్గా అనిపిస్తే అలా టీవీలో నెట్‌ఫ్లిక్స్ చూస్తూ కాలక్షేపం చేయడమే. ఇలా వారానికి 37.5 గంటలు గడపాలి. ఈ సందర్భంగా పరిశీలించిన అంశాలతో.. ఆ కంపెనీ పరుపులు ఎలా ఉన్నాయో వారానికి ఓమారు సమీక్ష నివేదిక ఇవ్వాలి. ‘మ్యాట్రెస్ టెస్టర్’ అని గౌరవంగా పిలిచే ఈ పనికి నెల జీతం అక్షరాలా.. రూ.24.79 లక్షలు. అవాక్కయ్యారా!.. విలాసవంతమైన పరుపుల కంపెనీ ‘క్రాఫ్టెడ్ బెడ్స్’ ఈ మహత్తరమైన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ‘ఆ.. ఏం వెళతాంలే! అంత దూరం ఆఫీసుకు’ అనుకునే సుకుమారులకు కంపెనీ మరో గొప్ప సదుపాయం కూడా కల్పిస్తోంది. ‘ఇంటి పట్టునే ఉండండి. మేమే పరుపు పంపిస్తాం. పరిశీలించిన అంశాలు నివేదిస్తే చాలు’ అంటోంది. అయితే ఈ ఉద్యోగావకాశం 18 ఏళ్లు నిండి, బ్రిటిష్ పౌరసత్వం ఉన్నవాళ్లకు మాత్రమే సుమా!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
SKY: వాషింగ్టన్ సుందర్ విషయంలో నాదే తప్పు.. వైరల్గా మారిన సూర్య వ్యాఖ్యలు
-
Politics News
Nitish: భాజపాతో మళ్లీ జట్టు కట్టడం కంటే చనిపోవడమే మేలు : నీతీశ్
-
Movies News
Telugu Movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
-
Sports News
IND vs NZ: చాహల్ విషయంలో హార్దిక్ నిర్ణయం సరైంది కాదు: గంభీర్
-
World News
Pakistan: మసీదులో బాంబు పేలుడు.. 28మంది మృతి, 150మందికి గాయాలు
-
General News
TS HighCourt: తొలగిన ప్రతిష్టంభన... గవర్నర్ ప్రసంగంతోనే బడ్జెట్ సమావేశాలు