
Updated : 20 Nov 2021 10:44 IST
AP News: కదిరిలో విషాదం.. నిర్మాణంలో ఉన్న భవనం కూలి ముగ్గురి మృతి
కదిరి: అనంతపురం జిల్లా కదిరిలో విషాదం చోటు చేసుకుంది. పాత ఛైర్మన్ వీధిలో నిర్మాణంలో ఉన్న భవనం కూలి పక్కనే ఉన్న రెండు భవనాలపై దాని శిథిలాలు పడ్డాయి. ఈ ఘటనలో ఒక ఇంట్లో ఉన్న 8 మంది, మరో ఇంట్లోని ఏడుగురు శిథిలాల కింద చిక్కుకున్నారు. మొత్తం 15 మందిలో ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ మృతిచెందారు. 10 మంది క్షేమంగా బయటపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న ఇద్దరిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టారు. భవనం కూలే సమయంలోనే గ్యాస్ సిలిండర్ పేలిందని బాధితులు తెలిపారు. ఘటనాస్థలిని అదనపు ఎస్పీ రామకృష్ణప్రసాద్, ఆర్డీవో వెంకటరెడ్డి పరిశీలించారు. శిథిలాల్లో ఉన్న కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెవెన్యూ, పోలీసు అధికారుల సమక్షంలో శిథిలాలను తొలగిస్తున్నారు.
Tags :