Cat Vs Snake: ఎదురు నిలిచిన పిల్లి.. తోకముడిచిన పాము

యజమాని కుటుంబాన్ని తాచుపాము నుంచి కాపాడిన ఓ పల్లి సూపర్‌ హీరోగా నిలిచింది. తన యజమాని కుటుంబాన్ని రక్షించేందుకు ప్రమాదకరమైన తాచుపాముతో..

Updated : 22 Jul 2021 18:52 IST

భువనేశ్వర్‌: యజమాని కుటుంబాన్ని తాచుపాము నుంచి కాపాడిన ఓ పిల్లి సూపర్‌ హీరోగా నిలిచింది. తన యజమాని కుటుంబాన్ని రక్షించేందుకు ప్రమాదకరమైన తాచుపాముతో పోరాడింది. దాదాపు గంటసేపు విషసర్పాన్ని ఎటూ కదలనివ్వకుండా ఎదురు నిలిచి పామును తోకముచిచేలా చేసింది. ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగిన ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఒడిశా భువనేశ్వర్‌లోని భీమసాంగి ప్రాంతంలో నివశిస్తున్న సంపత్‌ కుమార్‌ పెరట్లోకి నాగుపాము ప్రవేశించింది. ఇంటి వెనక నుంచి వస్తున్న పామును గుర్తించిన పెంపుడు పిల్లి చిన్ను దాన్ని పెరట్లోనే అడ్డుకుంది. చిన్ను అడ్డుగా నిలవడంతో ఆ సర్పం పదేపదే బుసలు కొట్టింది. అయినా కదలకుండా అడ్డుతగిలిన చిన్ను విషనాగుకు ఎదురు తిరిగింది. భయపెట్టాలని తాచు పడగ విప్పినా  పిల్లి ఏమాత్రం భయపడకుండా అక్కడే కూర్చుంది. కుక్క అరుపులు విని కిందకువచ్చిన సంపత్‌కుమార్ పాము, పిల్లిని చూసి ఆశ్చర్యపోయారు. ఈలోగా సంపత్‌కుమార్‌ స్నేక్‌ హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేశారు. స్నేక్‌ వాలంటీర్‌ అరుణ్‌కుమార్‌ ఇంటికి వచ్చే వరకు పామును ఆ పిల్లి నిలువరించింది. వాలంటీర్‌ ఆ సర్పాన్ని పట్టుకుని నగరం బయట ఉన్న అటవీ ప్రాంతంలో వదిలేశాడు. అయితే రెండింటి మధ్య దాడి జరిగిన సమయంలో పిల్లికి ఏదైనా కాటు పడిందేమోనని తెలుసుకునేందుకు దానికి పరీక్షలు చేశారు. కాని చిన్ని సురక్షితంగా ఉన్నట్లు స్నేక్‌ హెల్ప్‌లైన్‌ అధికారులు వెల్లడించారు. ప్రాణాలకు తెగించి కుటుంబాన్ని కాపాడిన కుటుంబసభ్యులు ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని