YS Jagan: జగన్‌ పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు సమయం కోరిన సీబీఐ

సీబీఐ కోర్టులో జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది. పెన్నా ఛార్జ్‌షీట్‌ నుంచి తన పేరు తొలగించాలన్న  సీఎం జగన్‌  డిశ్ఛార్జి పిటిషన్‌పై  కోర్టు విచారణ చేపట్టగా..

Updated : 22 Jul 2021 17:18 IST

హైదరాబాద్‌: సీబీఐ కోర్టులో జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది. పెన్నా ఛార్జ్‌షీట్‌ నుంచి తన పేరు తొలగించాలన్న  సీఎం జగన్‌  డిశ్ఛార్జి పిటిషన్‌పై  కోర్టు విచారణ చేపట్టగా.. కౌంటర్‌ దాఖలు చేసేందుకు సీబీఐ సమయం కోరింది.  పెన్నా, ఇందూ టెక్‌ జోన్‌ కేసుల నుంచి తన పేరు తొలగించాలన్న తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిశ్ఛార్జి పిటిషన్‌పై కూడా కౌంటరు దాఖలు చేసేందుకు సీబీఐ సమయం కోరింది. శామ్యూల్‌, రాజగోపాల్‌ డిశ్ఛార్జి పిటిషన్లపై విచారణ ఆగస్టు 2కి వాయిదా పడింది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలన్న విజయసాయిరెడ్డి  పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. ఓఎంసీ కేసులో డిశ్ఛార్జి పిటిషన్‌పై వాదనలకు సిద్ధం కావాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డిని సీబీఐ కోర్టు ఆదేశించింది. ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి డిశ్ఛార్జి పిటిషన్‌పై  విచారణ ఈనెల 27కి వాయిదా పడింది. ఓఎంసీ కేసులో మరో ఛార్జ్‌షీట్‌ వేయబోమని సీబీఐ అధికారులు స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని