జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో మరోసారి విచారణ..

Updated : 14 Jul 2021 13:10 IST

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో మరోసారి విచారణ జరిగింది. లిఖిత పూర్వకంగా తమ వాదనలు సమర్పిస్తామని న్యాయస్థానానికి సీబీఐ తెలిపింది. వాదనల సమర్పణకు 10 రోజుల గడువు కోరింది. సీబీఐ వైఖరిపై రఘురామ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. సీబీఐ తరచూ వైఖరి మారుస్తూ కాలయాపన చేస్తోందని ఆరోపించారు. అనంతరం పిటిషన్‌పై విచారణను సీబీఐ కోర్టు ఈనెల 26కి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని