Jagan Bail Cancel Petition: జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై తీర్పు వాయిదా

అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్న ఏపీ సీఎం జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్లపై తీర్పు వాయిదా పడింది. ..

Updated : 25 Aug 2021 14:12 IST

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్న ఏపీ సీఎం జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్లపై తీర్పు వాయిదా పడింది. జగన్‌, విజయసాయి బెయిల్‌ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లపై గత కొంతకాలంగా నాంపల్లిలోని సీబీఐ కోర్టు విచారణ జరుపుతోంది. ఈ కేసులో జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై ఇప్పటికే వాదనలు పూర్తికాగా.. విజయసాయి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై ఈరోజు వాదనలు ముగిశాయి. దీంతో ఈ రెండు పిటిషన్లపై ఒకే రోజు తీర్పు వెలువరిస్తామని సీబీఐ కోర్టు వెల్లడించింది. తీర్పు వెల్లడిని వచ్చే నెల 15కి వాయిదా వేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని