Ts News: విజయసాయిరెడ్డివిచారణకెందుకు రాలేదు?: సీబీఐ కోర్టు

జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి విచారణకు ఎందుకు హాజరు కాలేదని సీబీఐ కోర్టు ప్రశ్నించింది. దిల్లీలో ఉన్నందున ఇవాళ్టి విచారణకు హాజరుకాలేక పోయారని

Updated : 23 Dec 2021 21:52 IST

హైదరాబాద్‌: జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి విచారణకు ఎందుకు హాజరు కాలేదని సీబీఐ కోర్టు ప్రశ్నించింది. దిల్లీలో ఉన్నందున ఇవాళ్టి విచారణకు హాజరుకాలేక పోయారని విజయసాయిరెడ్డి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పార్లమెంటు సమావేశాలు ముగిశాయి కదా అని న్యాయస్థానం అడగ్గా.. సాయంత్రం వరకు జరిగినందున ఇవాళ రాలేకపోయారని న్యాయవాది వివరించారు. దీంతో విజయసాయిరెడ్డికి నేటి విచారణకు హాజరు మినహాయింపునిచ్చింది. జగతి పబ్లికేషన్స్ ఈడీ కేసులో డిశ్చార్జ్ పిటిషన్ పై ఇవాళ విజయసాయిరెడ్డి వాదనలు జరిగాయి. ఈడీ అటాచ్ చేసిన ఆస్తులపై హైకోర్టులో స్టేటస్ కో ఉన్నందున.. ప్రస్తుత దశలో విచారణ జరపడం తగదని విజయసాయిరెడ్డి తరఫు న్యాయవాది వాదించారు. సీబీఐ కేసు కూడా ఇంకా రుజువు కాలేదన్నారు. విజయసాయిరెడ్డి డిశ్చార్జ్ పిటిషన్‌పై విచారణ ఈనెల 30కి వాయిదా పడింది. ఇందూ టెక్ జోన్ లో డిశ్చార్జ్ పిటిషన్‌పై జగన్ వాదనలు జరిగాయి. ఇందూ టెక్ జోన్‌కు భూమి కేటాయింపు ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయమని జగన్ తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి వాదించారు. జగన్ డిశ్చార్జ్ పిటిషన్‌పై వాదనలు ఈనెల 31కి వాయిదా పడ్డాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని