విజయసాయి బెయిల్‌ రద్దుపై నిర్ణయం మీదే: కోర్టులో సీబీఐ మెమో దాఖలు

జగన్‌ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి  బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ

Updated : 13 Aug 2021 12:23 IST

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి  బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. బెయిల్‌ రద్దు పిటిషన్‌పై నిర్ణయాన్ని కోర్టుకే సీబీఐ వదిలిపెట్టింది. విచక్షణ మేరకు పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలంటూ న్యాయస్థానంలో మెమో దాఖలు చేసింది. మరోవైపు సీబీఐ నిర్ణయంపై కౌంటర్‌ దాఖలు చేసేందుకు గడువు కావాలని విజయసాయిరెడ్డి కోర్టును కోరారు. అనంతరం పిటిషన్‌పై తదుపరి విచారణను సీబీఐ కోర్టు ఈనెల 16కు వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని